పెళ్లి చేస్తే.. తిప్పలు మరీ ఇంతలా ఉంటాయా?

196
Income Tax raid at Gali Janardhan Reddys mining firm
Income Tax raid at Gali Janardhan Reddys mining firm
- Advertisement -

వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడి జైలు పాలైన గాలి జనార్థన్ రెడ్డి ఇటీవల తన కుమార్తె బ్రాహ్మణిని.. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్తకు ఇచ్చి వివాహం జరపటం తెలిసిందే. వ్యాపారాల్లో అక్రమాలకు ఇబ్బందులు ఉంటాయన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే.. మోతాదు మించిన ఖర్చుతోనూ తిప్పలు మరీ ఇంతలా ఉంటాయా? అన్న ఆశ్చర్యం అక్రమ గనుల కేసుల్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో ఒకటిగా చెబుతున్న ఈ పెళ్లికి రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

ఐటీ అధికారులు గాలి జనార్థన్ రెడ్డికి పంపిన కొన్ని ప్రశ్నలు..
పెళ్ళికి ముందు జరిగిన ఖర్చు ఎంత? తర్వాతి ఖర్చు ఎంత? వివరాలివ్వండి?
పెళ్లి కోసం ఖరీదైన వస్తువులు ఎక్కడ కొన్నారు? ఎంత చెల్లించారు?
పెళ్లికి ఎంత మంది హాజరయ్యారు?
ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కు ఎంత ఇచ్చారు?
బౌన్సర్‌లకు ఎంత చెల్లించారు?
రవాణా, వసతి సదుపాయాలు, వినోద కార్యక్రమాల ఖర్చు ఎంత?
ప్యాలెస్‌లో భారీగా నిర్మించిన కళాఖండాలకు ఎంతైంది?
పెళ్లి పత్రికల ఖర్చెంత?
బ్రహ్మణికి కొనుగోలు చేసిన ఆభరణాలు, ఖరీదైన వస్ర్తాల వివరాలు ఇవ్వండి?
పెళ్లి ఖర్చులను ఏయే ఖాతాల ద్వారా చేశారు? క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లిస్తే, ఆ వివరాలు ఇవ్వండి?
పెళ్లిలో బంధుమిత్రులకు ఇచ్చిన కానుకల వివరాలు సమర్పించండి?

ఇన్నేసి ప్రశ్నల్ని ఏ మాత్రం ఊహించిన గాలి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇంతకాలం అక్రమ మైనింగ్ కేసుల విచారణతో ఇబ్బంది పడ్డ గాలి.. తాజాగా కూతురు పెళ్లి ఖర్చు ఆయనకు మరిన్ని తలనొప్పుల్ని తెచ్చిపెట్టినట్లుగా చెప్పొచ్చు.

- Advertisement -