గ్లోబర్ వార్మింగ్‌తో వాతావరణంలో మార్పులు

449
imd rajarao
- Advertisement -

గ్లోబల్ వార్మింగ్ తో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు హైద్రాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు. ఇప్పటికే నైరుతి పవనాలు దాదాపుగా 45 రోజులుకు పైగా ఆలస్యం అయిందన్నారు.

సాధారణముగా బంగాళాఖాతంలో అధికంగా అల్పపీడనలు ఏర్పడతాయి .కానీ ఈ సారి ఎక్కువగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డాయన్నారు. ప్రజలు పొగరహిత వాహనాలు వాడాలి,చెట్లను పెంచాలన్నారు. ఆగ్నేయా,దక్షిణ దిక్కు నుంచి తేమ గాలులు రావడం వలన రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని చెప్పారు.

మరోరెండు రోజులు పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. నవంబర్ నుంచి ఈ రోజు వరకు కేవలం 2 రోజులు మాత్రమే చలి ఏర్పడిందని…ఈ సారి ఉత్తర దిక్కు నుంచి ఇంకా చలి గాలలు రాలేదన్నారు. దీని బట్టి చూస్తే ఈ సారి ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం మనకు కన్పిస్తుందన్నారు.

- Advertisement -