అతనితో ఇలియానా లవ్ కహానీలు !

237
- Advertisement -

గోవా ముదురు భామ ఇలియానా అంటే.. ఇప్పటికీ యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా తన అందచందాలతో ఇలియానా కనువిందు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఓ హిందీ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఇలియానా పై బాలీవుడ్ లో రోజురోజుకూ రూమర్స్ ఎక్కువైపోతున్నాయి. ఇలియానా మళ్లీ ప్రేమలో పడిందట. ఓ సీనియర్ బాలీవుడ్ హీరోతో ఇలియానా చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉందని.. అందుకే ఈ మధ్య ఇలియానా తరుచూ ఆ హీరో అఫీస్ కి వెళ్తుందని.. అలాగే ఆ హిందీ సీనియర్ హీరో కూడా ఇలియానా ఇంటిలో పలుసార్లు కనిపించాడని ఇలా చాలా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ పుకార్లల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఇలియానా మాత్రం చాలా బోల్డ్ గా ముందుకు పోతుంది. ఎవరైనా ప్రేమ గురించి అడిగితే.. ప్రేమ లేదు, దోమ లేదు అంటూనే.. లవ్ కహానీలు నడుపుతుంది. మొత్తానికి ఆ హిందీ సీనియర్ హీరో గారి సేవలో ఇలియానా ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతానికి హిందీ సినీ పరిశ్రమలో ఇలియానా గురించి ఈ గుసగుసలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి పుకార్లు ఇటు ఇలియానా పై, అటు సదరు సీనియర్ హీరో పై గతంలో ఎన్నోసార్లు వచ్చాయి. అయినా వీరెప్పుడు తమ ప్రేమ గుట్టు పై ఎప్పుడు రియాక్ట్ కాలేదు.

ఇలియానా అసలు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ పుకార్లు అంతా నిజమే అనుకుంటున్నారు. ఎలాగూ వయసు కూడా 38 దాటేస్తుంది. నిజానికి ఐదేళ్ల క్రితమే ఇలియానా పెళ్లి ఆలోచన చేసింది. కానీ కాలం కలిసి రాక, పెళ్లి కాలేదు. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. ఇలియానా కూతురు కూడా ఈ పాటికి చైల్డ్ ఆర్టిస్ట్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఉండేది. కానీ ఏమి చేస్తాం, ఇంకా ఇలియానా కే పెళ్లి కాకపాయే.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ తో పులి.. మహేష్ తో సింహం

జనవరి నుంచే.. మహేష్ నుంచి క్లారిటీ

విజయ్ దేవరకొండకి బండ్ల పంచ్

- Advertisement -