విజయ్ దేవరకొండకి బండ్ల పంచ్

255
- Advertisement -

సోషల్ మీడియాలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏ పోస్ట్ పెట్టినా దాని కింద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువై పోతున్నాయి. తాజాగా విజయ్ తన తండ్రి పక్కన కూర్చొని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్ షేర్ చేసిన ఫోటోలో రిచ్ నెస్ కనిపిస్తుంది. అలాగే విజయ్ తండ్రి ముందు ఓ టేబుల్ పై కాలు పెట్టడం కొంతమందికి నచ్చలేదు. దీంతో విజయ్ ను ట్రోల్ చేస్తూ నాన్న ముందు అలా కాలు పెట్టడం ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు.

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా సోషల్ మీడియాలో విజయ్ ఫోటో తో తన నాన్న కి క్షౌరం చేస్తున్న ఫోటో షేర్ చేస్తూ ఓ కామెంట్ పెట్టాడు.”మనకి ఈ ప్రపంచాన్ని చూసి అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు వారిని ప్రేమించటం పూజించటం మన ధర్మం”. అంటూ విజయ్ కి డైరెక్ట్ గా పంచ్ వేశాడు.

ఏదేమైనా యాంటీ ఫ్యాన్స్ , నెటిజన్లు విజయ్ పై కామెంట్స్ చేస్తే ఓకె కానీ ఇండస్ట్రీ వ్యక్తి అయిన బండ్ల ఇలా నేరుగా టార్గెట్ చేసి కామెంట్ పెట్టడం హాట్ టాపిక్ అవుతుంది. ఏదేమైనా లేటెస్ట్ ఫొటోస్ తో విజయ్ మళ్ళీ యన్టీ ఫ్యాన్స్ కి , ట్రోలర్స్ కి దొరికినట్టైంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -