ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా…. తర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టి సౌత్ సినిమాల వైపు కన్నెత్తయినా చూడటం లేదు. అమ్మడు నటించిన తొలి చిత్రం మంచి విజయం సాధించినప్పటీ…. తర్వాత సినిమాలన్నీ ప్లాపయ్యాయి. వరుస ప్లాపులతో ఇలియానాకు కూడా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చేతిలో పెద్దగా సినిమాలు లేక పోవడంతో… ఖాళీ సమయాన్ని తన బాయ్ ఫ్రెండుతో గడపటానికి కేటాయిస్తోంది.
అంతేగాదు బాయ్ ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు ఎక్స్ ఫోజ్ చేస్తూ దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను తన వైపు తిప్పుకుంటోంది.దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఖాతాను అనుసరించే వారి సంఖ్య ఆరు మిలియన్లకు(అరవై లక్షలు) చేరుకున్నది. ఈ సందర్భంగా ప్రియుడు ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తీసిన తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను అభిమానులతో పంచుకున్నది ఇలియానా. ఫాలోవర్స్ సంఖ్య ఆరు మిలియన్లకు చేరుకోవడం అవధులేని ఆనందాన్ని కలగిస్తున్నదని తెలిపింది. అంతా మీరే చేశారు. మీరు చేసిన పనివల్ల నేను ఆనందాన్ని పొందుతున్నాను చెబుతోంది.
ప్రస్తుతం ‘బాద్షాహో’ చిత్రంలో గీతాంజలిగా నటించింది ఇలియానా. అజయ్‌దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మి, ఈషా గుప్తా కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఆ సినిమాలో తన పాత్రకు తప్పకుండా విమర్శకుల ప్రశంసలు అందుతాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.