నా బొడ్డుమీద అలా చేస్తే..రచ్చ రచ్చే..!

275
I will throw the coconut right back at them: Amy on South directors ...
- Advertisement -

ఆయన సినిమాల్లో ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉండాల్సిందే. తినడానికి కాదండోయ్‌..కావాల్సిన సీన్‌ తియ్యడానికి. ఆయన తీసే సినిమాల్లో హీరోయిన్‌ బొడ్డుకి హీరో కిస్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా..ఫ్రూట్స్‌ మాత్రం ఖచ్చితంగా కిస్‌ ఇవ్వాల్సిందే. ఆ సీన్‌ చూసిన ఆడియన్స్‌కి కిక్కుండాల్సిందే.!

ఇంతకీ ఫ్రూట్స్‌ లేనిదే సినిమాలు తీయని ఆ డైరెక్టర్‌ ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా.? అవును… దర్శకుడు రాఘవేంద్రరావు .

 I will throw the coconut right back at them: Amy on South directors ...

హీరోయిన్ల బొడ్డు పై ఫ్రూట్స్‌ వేయడం దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలా వేయడమే ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. ఎప్పుడో ‘ఝుమ్మందినాదం’ సినిమాలోని ఓ పాటలో హీరోయిన్‌ తాప్సీ బొడ్డుపై దర్శకుడు రాఘవేంద్రరావు కొబ్బరికాయ వేయిస్తాడు.

ఇక ఆ పాట కోసం డైరెక్టర్‌ తన బొడ్డుపై కొబ్బరికాయ వేశారని, అందులో రొమాన్స్‌ ఏముందో తనకైతే అర్థం కాలేద’ని ఓ రియాలిటీ షోలో తాప్సీ వెటకారంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో తాప్సీ ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పుకుంది.

I will throw the coconut right back at them: Amy on South directors ...

ఇక అసలు విషయానికోస్తే…తాజాగా ఈ వివాదంపై హాట్‌ హీరోయిన్‌ అమీ జాక్సన్‌ స్పందించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఈ హాట్ బ్యూటీకి ఏ ప్రశ్న ఎదురైంది. ‘మీపై అలా కొబ్బరికాయ విసిరితే ఏమి చేస్తారు’? అని. దీనికి స్పందించిన అమీ.. ‘ అదృష్టవశాత్తూ ఇప్పటివరకు నేను మంచి వ్యక్తిత్వం ఉన్న దర్శకులతోనే పనిచేశాను.

అలా కొబ్బరికాయలు విసరడం చాలా భయంకరంగా ఉంటుంది. నాకైతే ఎప్పుడూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు. ఒకవేళ ఎవరైనా దర్శకుడు నాపై కొబ్బరికాయ విసిరితే తిరిగి వారి మొహం మీదకే విసిరేస్తాను. అందుకే నాతో ఎవరూ అలా ప్రవర్తించలేదేమో.’ని సమాధానమిచ్చింది అమీజాక్సన్‌. మొత్తానికి అమీ బోడ్డు మీద కొబ్బరికాయ వేస్తే రచ్చ రచ్చేనేమో.

- Advertisement -