యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న టాలీవుడ్ టాప్ హీరో. 2016 ఎన్టీఆర్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. వరస హిట్స్‌తో టాలీవుడ్‌ను షేక్ చేశాడు ఎన్టీఆర్.ప్రస్తుతం యంగ్ టైగర్ తో సినిమా చేసే ప్రొడ్యూసర్స్ కు కాసుల వర్షం గ్యారెంటీ. ఇది ఎన్టీఆర్ స్టామినా. కానీ గతం ఎన్టీఆర్‌ని ఇంకా వదలటం లేదు.
ఎన్టీఆర్ కెరియర్లో భయంకరమైన డిజాస్టర్ సినిమాల లిస్టులో ముందుండే సినిమా శక్తి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కి 2011 మార్చి 1న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది.
ఈ సినిమా తర్వాత అశ్వినిదత్ ఆర్థికంగా దెబ్బతిన్నారన్న టాక్ కూడా వచ్చింది. అసలు ఎన్టీఆర్ ఈ సినిమా ఎందుకు చేశాడు ? అశ్వనీదత్ ఎందుకు నిర్మించారన్న ప్రశ్నలు సైతం శక్తిపై వినిపించాయి. అయితే ఈ సినిమా గురించి అసలు నిర్మాత ప్రియ దత్ అసలు మ్యాటర్ బయటపెట్టింది. శక్తితో తీవ్రంగా నష్టపోయామని తెలిపింది.
ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అశ్విని దత్ సైతం అంగీకరించాడు. ఎన్టీఆర్ తో నిండా మునిగిపోయామని…దాదాపుగా రూ.25 కోట్లు నష్టం వచ్చిందన్నారు. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి ఇంత టైం పట్టిందని వెల్లడించారు.
దర్శకుడు కథ చెప్పిన విధానం బాగా నచ్చడంతో ఖర్చు గురించి ఆలోచించలేదని చెప్పారు.. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవ్వరికి తెలియదని… శక్తి సినిమా కథ వింటున్నప్పుడు చాలా అద్భుతంగా కొత్తగా అనిపించింది. కథ బాగోకపోతే సినిమా చేయడానికి మేమందరం ఫూల్స్ కాదని…కానీ సినిమా తీశాక అసలు మనం అనుకున్న కథ వెండితెర మీద ఎలావచ్చిందన్న దానిమీదే రిజల్ట్ ఆధారపడి ఉంటుందని తెలిపారు.
శక్తి తర్వాత ప్రస్తుతం అశ్వినీదత్… ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కమిట్ అయ్యాడు. మరి ఈ సినిమాతోనైనా అశ్వినీదత్…పూర్వవైభవాన్ని పొందుతాడో లేదో చూడాలి.