మార్కెట్‌లో దుమ్మురేపిన పతాంజలి…..

137
Baba Ramdev Patanjali

దేశంలో శరవేగంగా మార్కెట్లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న సంస్ధ పతంజలి.ఇప్పుడు బాబా రాందేవ్‌ సత్తాకు పతంజాలి బ్రాండ్స్‌ మరోసారి నిదర్శనంగా నిలిచాయి. యోగాతో ఆయనకు వచ్చిన క్రేజ్‌తో పతాంజలి ఆయుర్వేదిక్‌ బ్రాండ్‌ను తెరమీదకు తెచ్చారు. పతాంజలి బ్రాండ్స్‌ 2016 ఇండియన్‌ మార్కెట్లో దుమ్మురేపాయి. ఏకంగా 146శాతం వృద్ధితో 2016లో ఈరంగంలో అత్యంత టాప్‌లో ఉందని తాజాగా వెలువడిన సర్వే ఒకటి స్పష్టం చేసింది.

Patanjali Ayurved

అసోచాం-టెక్ సైన్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ప‌తాంజ‌లి బ్రాండ్స్ $769 కోట్ల ఆదాయంతో పతాంజలి 146 శాతం వృద్ధి నమోదు చేసుకోవడం తన ప్రత్యేకతను చాటుకుందని అసోచాం రిపోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం ఐటీసీ – డాబర్ – హిందూస్తాన్ యూనిలీవర్ – ప్రోక్టర్ ఆండ్ గాంబిల్ – కోల్గెట్-పామోలివ్ ల మొత్తం మార్కెట్ ఆదాయానికి ఇది సమానం అని ఈ నివేదిక విశ్లేషించింది. ఈ బ్రాండ్లన్నీ రెండంకెల వృద్ధిని సాధించేందుకు అవస్థలు పడుతుంటే… పతాంజలి బ్రాండ్ మాత్రం దుమ్మురేపే రీతిలో 146 శాతం వృద్ధిని సాధించిందని ప్రశంసించింది. పతాంజలి బ్రాండ్ లో భాగంగా ముందుగా ఆయుర్వేదిక్ ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు ఉద్దేశించినప్పటికీ అనంతరం దశల వారీగా ఇతర ప్రోడక్షన్లు ముఖ్యంగా కాస్మోటిక్ లను తయారు చేసింది. అలా ఆహార ఉత్పత్తుల రంగంలోకి వచ్చిన పతాంజలి అనంతరం కాలంలో ఈ మార్కెట్ లో తనపట్టును సాధించుకుంది. ఇలా మిగతా సంస్ధలను దాటివేసే స్థాయికి చేరింది అని అసోచాం నివేదిక తెలిపింది.

Patanjali Ayurved

త్వరలో స్వదేశీ జీన్సు ప్యాంట్లు కూడా ఉత్పత్తి చేస్తామని పతాంజలి స్టోర్స్ అధిపతి, యోగా గురువు బాబా రాందేవ్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుర్వేద మందుల అమ్మకాలతో పదేళ్లక్రితం ప్రారంభమైన ‘పతాంజలి’ ప్రస్తుతం 500లకు మించి వివిధ రకాల ఉత్పత్తులతో దూసుకెళ్తోంది.