- Advertisement -
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి,టీఆర్ఎస్ నేత దానం నాగేందర్. తాను ఏ హోటల్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ని కలవలేదని తెలిపారు.తనకు టీఆర్ఎస్‌లో సరైన ప్రాధాన్యం లభించిందని…కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా తనవంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానిన తెలిపారు.
ఎలాంటి షరతులు లేకుండానే టీఆర్ఎస్ పార్టీలో చేరానని ఒకేసారి 105 మంది అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంనద్నారు. ఫస్ట్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడంపై అసంతృప్తి లేదని చెప్పారు.
త్వరలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ల పరిస్థితి ఆటలో కాయిన్‌లా తయారైందన్నారు. తెలంగాణకు మళ్లీ సీఎం కేసీఆరే అవుతారని జోస్యం చెప్పారు.
- Advertisement -