భారీ సెట్‌లో రాజశేఖర్ కొత్త మూవీ..

259
Rajasekhar
- Advertisement -

డాక్టర్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి’. “అ!” సినిమాతో సినీ ఇండస్ట్రీ కి పరిచయమైన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తెలంగాణా నేపథ్యంలో జరిగే కథగా ఉండబోతుందట. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా కోసం రూ. 2 కోట్లతో హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను నిర్మంచారని సమాచారం. సినిమాలో మేజర్ పార్ట్ ఈ సెట్ లోనే చిత్రీకరించనున్నారట. ఇలాంటి పీరియడ్ సినిమాలకు సెట్స్ ఎంత ముఖ్యమో ‘రంగస్థలం’ సినిమా అందరికీ మరోసారి ఋజువు చేసింది.

Rajasekhar

దీంతో ప్రొడ్యూసర్స్ కూడా కథకు అవసరమైన సెట్స్ పై భారీగా ఖర్చుపెట్టేందుకు వెనకాడడం లేదు. ‘PSV గరుడవేగ’ సినిమా తర్వాత డాక్టర్‌ రాజశేఖర్‌ నటిస్తున్న ‘కల్కి’ మూవీ CK ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై C.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కూతుళ్ళు శివాని- శివాత్మిక కూడా హ్యాపీ మూవీస్ బ్యానర్‌తో ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.

- Advertisement -