ధోని సర్‌ప్రైజ్‌తో షాక్ అయ్యా: గంగూలీ

167
dhoni
- Advertisement -

మహేంద్రసింగ్ ధోని ఇచ్చిన సర్ ప్రైజ్‌తో షాక్ అయ్యానని వెల్లడించారు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడంలో ధోని సమర్ధుడని, నైపుణ్యం ఉన్న ఆటగాడని తెలిపాడు.

తన చివరి టెస్టు మ్యాచ్ సందర్భంగా చివరి ఓవర్ల ఆటలో తనకు కెప్టెన్సీ బాధ్యతలను ధోని అప్పగించారని అది తనను ఆశ్చర్య పరిచిందన్నాడు. ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్న దాదా….ధోనీ అలా చేస్తాడని అసలు ఊహించలేదు. ధోనీ చాలా తెలివిగా ఆలోచించాడు. ఆ సమయంగలో నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యా అని చెప్పాడు.

కానీ ఆ సమయంలో తన మనసంతా రిటైర్‌మెంట్‌పైనే ఉందని, ఆ చివరి మూడు నాలుగు ఓవర్లలో ఏం చేశానో కూడా సరిగా గుర్తులేదని దాదా తెలిపాడు.

- Advertisement -