కరోనాను తరిమికొట్టాలని అమ్మవారిని కోరుకున్నా: తలసాని

222
talasani srinivas
- Advertisement -

తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల జాతర ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్మీ రిటైర్ ఉద్యోగి మధ్యప్రదేశ్ నుంచి ఉజ్జయిని అమ్మవారిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించారని చెప్పారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు వచ్చేవారు..కరోనా వైరస్ ప్రభావం తో భక్తులకు దర్శనాన్ని రద్దు చేశామన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని డిపార్ట్మెంట్ల సహాయంతో బోనాల జాతరను ఘనంగా నిర్వహించుకుంటూన్నామని చెప్పారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము..మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి మొదటి బోనాన్ని టెంపుల్ బయటే సమర్పించామన్నారు.కొంతమంది తెలియని భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి వస్తున్నారు..ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

రేపు భవిష్యవాణితో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము..సికింద్రాబాద్ ప్రజలు ఎప్పుడు ఒక కమిట్మెంట్‌తో ఉంటారు..దేశ చరిత్రలోనే దేవుడి గుళ్ళకు డబ్బులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. దేవాదాయ శాఖ నుండి అన్ని దేవాలయాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాము..కరోనా మహమ్మారి ని తరిమికొట్టాలని ప్రజల పక్షాన అమ్మవారిని కోరుకుంటున్నానని చెప్పారు.

- Advertisement -