ఐపీఎల్:బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

113
csk

దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌-13వ సీజన్‌లో నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌ జరుగుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. విన్నింగ్‌ టీమ్‌నే కొనసాగిస్తున్నామని, తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని వార్నర్‌ తెలిపాడు. మరోవైపు చెన్నై టీమ్‌లో మూడు మార్పులు చేసినట్లు ధోనీ వెల్లడించాడు. మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, హేజిల్‌వుడ్‌ స్థానంలో అంబటి రాయుడు, శార్దుల్‌ ఠాకూర్‌, డ్వేన్‌ బ్రావోలను తుది జట్టులోకి తీసుకున్నట్లు మహీ పేర్కొన్నాడు. కాగా సన్‌రైజర్స్‌పై చెన్నైకి మంచి రికార్డు ఉంది. 2018 నుంచి హైదరాబాద్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌లో చెన్నై టీమ్‌ ఐదింటిలో గెలుపొందింది.

చెన్నై సూపర్ కింగ్స్‌‌:షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని (w / c), డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, షార్దుల్ ఠాకూర్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (C), జానీ బెయిర్‌స్టో (WC), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కె ఖలీల్ అహ్మద్, టి నటరాజన్