మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా శ్రీముఖి

776
Srimukhi Anchor
- Advertisement -

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. బుల్లితెరపై ప్రసారమయ్యే పటాస్ కామెడీ షోతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దానికితోడు బిగ్ బాస్ 3లో శ్రీముఖి చేసిన అల్లరికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈసందర్భంగా శ్రీముఖికి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ టైమ్స్ మీడియా సంస్థ మోస్ట్ డిజైరబుల్ గా ఉమన్’ (బుల్లితెర) గా శ్రీముఖి ఎంపికైంది. హైదరాబాద్ టైమ్స్ మీడియా సంస్ధ ఆన్ లైన్ లో పోల్ నిర్వహించగా శ్రీముఖికి ఎక్కువ మంది ఓట్లు వేశారు.

తాజాగా ఈ అవార్డు రావడంపై స్పందించింది యాంకర్ శ్రీముఖి. టెలివిజన్ రంగానికి సంబంధించి మోస్ట్ డిజైరబుల్ ఉమన్ గా ఎంపక అవుతానని అస్సలు ఉహించలేదని చెప్పింది. ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ నిర్వహించే ఈ ఆన్ లైన్ పోల్ ను బాగా ఫాలో అయ్యేదాన్నని, ఎప్పటికైనా గెలవాలని అనుకునేదాన్నని వెల్లడించింది. ఈ గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. కాగా గత సంవత్సరం హైదరాబాద్ టైమ్స్ మీడియా సంస్థ నిర్వహించిన పోల్ లో శ్రీముఖి 11వ స్ధానంలో ఉంది. ఈసారి 1 స్ధానానికి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు..

- Advertisement -