భారీ వర్షాలు…పోలీసుల కీలక సూచన!

45
- Advertisement -

భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని…వర్షం ఆగిన వెంటనే వాహనదారులు బయటకు రావొద్దని గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోని బయటికి రావాలని తెలిపారు. వర్షం పడుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలని పేర్కొన్నారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని, కావున ముందే కొన్ని ముఖ్యమైన రోడ్లలో ఇతర మార్గాలలో వెళ్లాలని చెప్పారు.

ఉదయం నుండి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌, మియాపూర్‌ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనరగ్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఉప్పల్‌ చిలుకానగర్‌, రామంతపూర్‌, మణికొండ, పుష్పాలగూడ, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, నార్సింగి, అత్తాపూర్‌, గండిపేటలో వర్షం పడగా కీలక సూచనలు చేశారు.

- Advertisement -