నిఖిల్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

132
- Advertisement -

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఆగస్టు 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు నిఖిల్. తన మొదటి రెమ్యునరేషన్ హ్యాపిడేస్ సినిమాకి తీసుకున్నాను. ఆ సినిమాకి డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల 25 వేల రూపాయలు ఇచ్చారు. అయితే ఆ సినిమాకి ఆడిషన్ చేసిన వాళ్ళు నువ్ సెలెక్ట్ అయ్యావు, నలుగురిలో ఒక హీరో క్యారెక్టర్, కానీ అది ఓకే అవ్వాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని అడిగారని తెలిపారు.

అది కచ్చితంగా ఎలాగైనా ఓకే చేసుకోవడానికి లక్ష రూపాయలు ఇచ్చాను అని తెలిపారు.

- Advertisement -