సుప్రీం కోర్టు ఆదేశాలతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్, ప్రెస్,పోలీస్,ఎంపీ,ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ జరిమానాలు విధిస్తూ, అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింలను తొలగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు ఫైన్ విధించగా తాజాగా ప్రభాస్ కారుకు చలాన్ విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు.
ప్రభాస్ కి సంబంధించిన కార్ కి ఎంపీ స్టిక్కర్ ఉన్న నంబర్ ప్లేట్, విండోలకి బ్లాక్ ఫిలింస్ ఉండటంతో 1450 రూపాయలు జరిమానా విధించారు. అయితే ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరని తెలిపారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, త్రివిక్రమ్, నాగ చైతన్య కార్లకు పోలీసులు ఫైన్ విధించిన సంగతి తెలిసిందే.