సూర్య పెద్ద మనసు…ఉచితంగా ఇళ్లు!

50
suriya
- Advertisement -

హీరో సూర్య మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న సూర్య…తాజాగా మత్స్యకార కుటుంబాలకు శుభవార్తను అందించారు.

బాలా – సూర్య కాంబోలో సినిమా తెరకెక్కుతుండగా ఇందులో జాలరిగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా చెన్నైలోని ఒక ప్రాంతంలో కొన్ని గుడిసెలతో ఒక గ్రామాన్ని నిర్మించబోతున్నారట మేకర్స్. భారీ ఖర్చుతో వేస్తున్న ఈ గుడిసెలను షూటింగ్ తరువాత తీసివేయకుండా చెన్నైలో ఇళ్లు లేని మత్య్యకారులకు ఉచితంగా ఇవ్వాలని సూర్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సూర్య తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తమవుతుండగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

- Advertisement -