నీరా కేఫ్‌ను తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్

54
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ. 20కోట్లతో ఆధునిక హంగులతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నీరా కేఫ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రజలకు అందించే తెలంగాణ వంటకాలు మాంసాహార వంటకాలు నీరా ప్రాసెసింగ్ యూనిట్‌లను పరిశీలించారు.

Also Read: అక్షయ ఓల్డేజ్ హోం..మొక్కలు నాటిన వృద్ధ మహిళ

నీరా కేఫ్‌కు వచ్చే వినియోగదారులను కలిసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నీరా కేఫ్‌లో అందించే వంటకాలను రుచి చూశారు. నాణ్యమైన వంటకాలను ప్రజలకు అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి సాంప్రదాయకంగా ఉన్న ఎన్నో ఔషధ గుణాలున్న నీరా కేఫ్‌పై కొందరు దుష్ప్రభావాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో సామాజిక అంతుచిక్కని రోగాలను కూడా నివారించవచ్చని తెలిపారు. గీత కార్మికులకు ఎంతో ప్రాణాలకు తెగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నీరా కేఫ్ను ప్రజలందరికీ చేరేలా కృషి చేయాలని స్టాల్ నిర్వహకులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: సీఎం ప్రధాన సలహాదారుడిగా సోమేష్ నియామకం

- Advertisement -