హైదరాబాద్ మెట్రో ఆదాయం..రూ.62.63 కోట్లు

245
hmr
- Advertisement -

భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే హైదరాబాద్‌ మెట్రోకు భాగ్యనగర వాసుల నుండి విశేష స్పందన వస్తోంది. రోజురోజుకి ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోతుండగా 2017-18లో మొత్తం రూ.62.63 కోట్లు ఆదాయం వచ్చింది. దాదాపు కోటి మందికి పైగా మెట్రోలో ప్రయాణించగా తొలి నాలుగు నెలల్లో టికెట్ల అమ్మకం ద్వారా రూ.28.60 కోట్లు సమకూరింది.

2017 నవంబరు 29న మియాపూర్‌ నుంచి నాగోల్‌ వరకు 30 కి.మీ. మెట్రో మార్గాన్ని ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌,ప్రస్తుత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ప్రారంభించారు. మెట్రో నిర్వహణ వ్యయం 41.06 కోట్లుగా ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు సంస్థ 2017-18 వార్షిక నివేదికలో పేర్కొంది.

తొలిదశలో 30 కిలోమీటర్ల మేర ఎల్బీనగర్‌ నుండి మియాపూర్‌ వరకు అందుబాటులోకి రాగా సెకండ్‌ ఫేజ్‌లో ఎల్బీనగర్-అమీర్ పేట 16 కిలోమీటర్ల అందుబాటులోకి వచ్చింది. మెట్రో స్టేషన్ల పరిధిలో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. దీనికి తోడు గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నారు.

- Advertisement -