మత్తెక్కిస్తున్న.. వెంకటలక్ష్మి

231
laxmi raai

మెగాస్టార్‌తో రత్తాలు రత్తాలు అంటూ ఊపు ఊపేసిన బ్యూటీ రాయ్ లక్ష్మీ. తాజాగా కృష్ణ కిషోర్ దర్శకత్వంలో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మిగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాపా నీకేదంటే ఇష్టమనే పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

టీజర్‌ మొత్తం రాయ్ లక్ష్మీ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సాగగా ఈ సినిమాతో అందాల ఆరబోతకు మరింత పదునుపెట్టినట్లు చెప్పకనే చెప్పింది. రాయ్ ల‌క్ష్మీ అందాలు యూత్‌కి మంచి మాస్‌ మసాలాను అందించాయి. రాయ్‌ లక్ష్మీతో రామ్ కార్తిక్ రొమాన్స్‌ చేయనుండగా పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌రి గౌర చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో నటిస్తున్న హాస్యనటులు ప్రవీణ్, మధునందన్ ల కామెడీ హైలైట్‌గా నిలవనుందని చిత్రయూనిట్ చెబుతోంది. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా కి ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చిలో మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.