తెలంగాణ..కోలుకున్న బాధితుడు.!

364
corona
- Advertisement -

గుడ్ న్యూస్‌…తెలంగాణలో కరోనా కేసు బాధితుడు కోలుకుంటుననాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి తాజా శాంపిల్స్ చెక్ చేయగా నెగటివ్ అని తెలినట్లు సమాచారం. న్యూమోనియా తగ్గడంతో శాంపిల్స్ తీసి తీసి గాంధీ మెడికల్‌ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. నెగెటివ్‌ అని తేలడంతో ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మరింత క్లారిటీ కోసం ఆ యువకుడి శాంపిల్స్‌ను పుణెలోని ల్యాబ్‌కు పంపించనున్నారు. ఇక్కడ నివేదిక నెగెటివ్‌ అని వస్తే  వీలైనంత త్వరలో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన యువకుడు ఇటీవల దుబాయ్‌ వెళ్లి వచ్చాడు. వైరస్ లక్షణాలతో గాంధీ ఆస్పత్రికి వెళ్లగా పాజిటివ్ తేలింది. అతడికి మెరుగైన చికిత్స అందించారు డాక్టర్లు.. దీంతో కోలుకున్నాడు.

- Advertisement -