హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఇంచార్జీగా పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను సమన్వయ పరుస్తూ, స్థానికంగానే ఉంటూ, పార్టీ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని రాజేశ్వర్ రెడ్డిని సిఎం ఆదేశించారు.
కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు రానుండడంతో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు స్థానికంగానే ఉండి, ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు సీఎం . మున్సిపాలిటీ వారీగా బాధ్యతలు తీసుకుని, ఎక్కడికక్కడ పార్టీ యంత్రాంగాన్ని సమన్వయ పరచాలని చెప్పారు.
హుజుర్ నగర్ ఉప ఎన్నిక వివరాలు…
()సెప్టెంబర్ 30న నామినేషన్లకు చివరిరోజు
()అక్టోబర్ 1న స్క్రూటిని
()అక్టోబర్ 03న నామినేషన్ల విత్ డ్రా కు చివరి రోజు
()అక్టోబర్ 21న పోలింగ్
()అక్టోబర్ 24 ఓట్ల లెక్కింపు..