హుజుర్ నగర్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన 100 మంది నేతలు ఉప ఎన్నికల ఇంఛార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి…..ఉత్తమ్ కి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ నెల 4 న హుజుర్‌నగర్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నాం….20 వేల మంది తరలి వస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్‌కి సీపీఐ మద్దతు పలకడం హర్షణీయం అన్నారు.
హుజుర్‌నగర్ లో ఏ గ్రామానికి పోయిన ప్రజలంతా అభివృద్ధి కి జై కొడుతూ టీఆర్ఎస్ వైపే వస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి గ్రామ గ్రామాన వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చి టీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. 24 న హుజుర్‌నగర్ లో గులాబీ జెండాను ఎగరేసి శ్రేణులతో కలిసి దసరా జరుపుకుంటాం అన్నారు. పార్టీ సమన్వయ కర్తలు, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా, ఐక్యతతో కార్యచరణతో ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అన్నారు.
హుజుర్నగర్ ఎన్నికల్లో ఉత్తమ్ ఆగడాలకు చెక్ పెడుతూ టీఆర్ఎస్ ఘన విజయం అందుకోవడం ఖాయమని తెలిపారు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు. ఈ ఉప ఎన్నికలు హుజుర్‌నగర్ ప్రజల బాగు కోసం వచ్చాయి…ఉత్తమ్ పదవి కాంక్ష, అధికార కాంక్ష తో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 40 వేల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.