హుజుర్ నగర్ లో గులాబీ జోరు

649
saidireddy Campain
- Advertisement -

హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. ఏగ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ ఓటు కారు గుర్తుకు అంటూ గ్రామాల్లో ప్రజలు తీర్మానం చేస్తున్నారు. ఇక మండలాల వారిగా నియమితులైన ఇంఛార్జులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను గ్రామాలలోని ప్రజలకు వివరిస్తున్నారు. Trs అభ్యర్థి సైదిరెడ్డి ని గెలిపించాలని కోరుతూ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు కిలోమీటర్ల మేర ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

shanampudi

వృద్దుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు భీమా, బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఇలా పలు పథకాల గురించి ఇంఛార్జ్ లు గ్రామాల్లో వివరిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని నెరేడుచర్ల మండలం పాలకీడు, నెరేడుచర్ల మండలాల్లో తండా లను గ్రామాలను mla అభ్యర్థి సైదిరెడ్డి చుట్టివస్తున్నారు. ఎమ్మోల్యే తో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇక నెరేడుచర్ల మండలం దర్శించర్ల గ్రామంలో mp మలోతు కవిత గ్రామ నాయకులతో సమావేశం అయ్యారు. గ్రామలోని ఓట్లన్నీ గంపగుత్తగా కారు గుర్తుకు పడేలా దిశానిర్దేశం చేశారు… హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో trs గెలవాల్సిన ఆవశ్యకత ను నాయకులకు వివరించారు.

- Advertisement -