బిజెపి ఈ ఏడేళ్లలో చేసిందేమి లేదు- మంత్రి

44

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఈనేపథ్యంలో జమ్మికుంటలోని మారుతినగర్‌లో తెలంగాణ బేడ బుడగ జంగాల ఆత్మీయ సమ్మేళనం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హజరైయ్యారు. బుడగ జంగాలందరూ ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసరావు, సింగిల్ విండో ఛైర్మన్ పొనగంటి సంపత్, స్థానిక కౌన్సిలర్ శ్రీలత, బుడగ జంగాల నాయకులు చింతల యాదగిరి, రాంకుమార్, లింగయ్య, వెంకటేష్, జాన్,‌సమ్మయ్య, లక్ష్మీ, శ్యాం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..బుడగ జంగాల తక్షణ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి తప్పక పరిష్కరిస్త..మీలో ఉన్న పేదలందరికి ఇండ్లు కట్టించే బాధ్యత నాది అన్నారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. ఎస్సీలలోని 59 కులాలలో బేడ బుడగ జంగాలు పేదలు అణగారిన కులాలలో ఇదొకటి. వీరు సంచార జాతి,కష్టజీవులు అని మంత్రి అన్నారు. నా నియోజకవర్గంలో కూడా బుడగ జంగాలు ఉన్నరు. ఈ జాతి గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలే.. కానీ మీ అందరికి కెసిఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు ద్వారా 10లక్షల చొప్పున వస్తయ్. రేషన్ కార్డు ఉండి,18ఏండ్లు నిండి,పెళ్లయితే దళితబంధు తప్పక వస్తది అన్నారు.

బిజెపి దరిద్రపు పని చేసింది ప్రస్తుతం ఈ పథకాన్ని ఆపించింది. బిజెపి ఈ ఏడేళ్లలో చేసిందేమి లేదు,ఇచ్చిందేమీ లేదు. హుజురాబాద్‌లో ఎన్నికలు పూర్తి కాగానే దళితులందరికి 10లక్షలు తప్పక వస్తయి..ఇందులో ఎటువంటి అనుమానాలొద్దు. ముఖ్యమంత్రి కెసిఆర్ మనందరి మంచిని ఆశించి బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా అన్ని కుటుంబాలకు ఇస్తమన్నారు. బ్యాంకు ఖాతాల్లో పడిన డబ్బులు తిరిగి వెనక్కి పోవు, ముఖ్యమంత్రి కూడా అందులో నుండి తీసుకోలేరు. ఆ డబ్బులతో మీకు ఇష్టమైన వ్యాపారం చేయొచ్చు,రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకోవచ్చు.ప్రపంచంలోనే ఇటువంటి పథకం గతంలో ఎక్కడా లేదు. ఇది దేశానికి ఒక గుణపాఠం కావాలి,అన్ని రాష్ట్రాల్లో మున్ముందు అమలయ్యే వత్తిడి పెరుగుతది. ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్పగా ఆలోచించి బ్యాంకు ఖాతా తెరిచేందుకు 2వేలు కూడా ప్రభుత్వం కట్టాలని నిర్ణయించారు.

మీరు జీవితంలో గొప్పగా స్థిరపడాలనే ఆలోచన చేసిన, చేస్తున్న కెసిఆర్ కు మనమందరం ఎల్లప్పుడూ కొండంత అండగా నిలవాలి. ఈటల అసలు టిఆర్ఎస్ ను వదిలి ఎందుకు పోయిండో తెల్వదు..రాజీనామా ఎందుకు రాజీనామా చేసిండో తెల్వదు.. కెసిఆర్ తో పంచాయతీ పెట్టుకుండు.. సార్ కుర్చీనే కావాలని ఆశించిండు..కెసిఆర్ ఇష్టం వచ్చినట్టు, నోటికొచ్చినట్టు తిడుతుండు..అగ్ని పెడత,ఘోరి కడత అంటుండు అని మంత్రి మండిపడ్డారు. పెంచి పెద్ద చేసిన కెసిఆర్ ను అట్ల తిట్టడం సమంజసమా? మన కెసిఆర్ ఇచ్చి వారు,పంచే వారు.. మరి బిజెపి గుంజుకునే పార్టీ అని మంత్రి విమర్శించారు. ఈటల నాకేందో అన్యాయం జరిగిందని బిజెపిలోకి పోయిండు,ఏం అన్యాయం జరిగిందని అడితే చెప్పడు.. మన కోసం పని చేసే,మనకు మంచి చేసే పార్టీ టిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ కు అండగా నిలుద్దాం..గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.