సమంత చేనేత కాంటెస్ట్‌…. సూపర్ రెస్పాన్స్

378
Huge response for Samantha Chenetha contest
- Advertisement -

చేనేతకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కేంద్రప్రభుత్వ సహాకారం కూడా తీసుకుంటున్న సర్కార్‌… రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల్లో కూడా చేనేత వస్త్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాదు చేనేత రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి కేటీఆర్ చొరవతో హీరోయిన్‌ సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో చేనేత బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడానికి సమంత తీసుకుంటున్న చొరవ మంచి ఫలితాన్ని రాబడుతోంది. సామ్ ఇచ్చిన పిలుపు మేరకు అమ్మాయిలు చేనేత చీరలు ధరించి ఆన్‌లైన్‌లో మెరుస్తున్నారు. తన తల్లి కట్టుకునే చేనేత చీరను తాను ధరించి ఆ ఫొటోను ట్విట్టర్‌లో ఉంచారు. ఇలా ఎవరైనా సరే తమ తల్లుల చేనేత చీరలను ధరించి.. #ReviveHandloom, #Woven2017 హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ చేయాలని సూచించారు.

జులై 31లోగా ఇలా ట్వీట్ చేసిన వారి ఎంట్రీలను పరిశీలించి, టాప్ 5 కాంటిస్టెంట్లను తెలంగాణ స్కిల్ ఆర్టిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఓవెన్ ఫ్యాషన్ షో 2017కు ఆహ్వానిస్తానని ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమంత కాంటెస్ట్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది తమ అమ్మల చీరలు ధరించి ట్వీట్ చేస్తున్నారు. సమంత ఆలోచనను మంత్రి కేటీఆర్  ప్రశంసించారు.

Huge response for Samantha Chenetha contest Huge response for Samantha Chenetha contest Huge response for Samantha Chenetha contest Huge response for Samantha Chenetha contest

- Advertisement -