ఎన్టీఆర్ నటనకు బ్రహ్మరథం!

44
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌ లో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పటికీ ఈ చిత్రానికి జపాన్ అభిమానుల నుంచి ఎనలేని ఆదరణ లభిస్తుండటం విశేషం. జపాన్ లో రేపు ప్రదర్శించబోతున్న ఒక షో దాదాపు హౌస్‌ ఫుల్‌ అయ్యింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జపాన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నిజంగా ఈ సినిమా జపాన్ లో ఇంత మంచి వసూళ్లను సాధిస్తుందని అస్సలు ఊహించలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటనకు జపాన్ ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ను చూసిన జపాన్ ప్రేక్షకులు విజిల్స్ తో ఊగిపోతున్నారు. నిజానికి రాజమౌళి ఎన్టీఆర్ కి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విషయంలో అన్యాయం చేశాడు అని అన్నారు. చూడబోతే.. ఎన్టీఆర్ కే జపాన్ లో ఎక్కువ పేరు వచ్చింది. ఆ మధ్య ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సతీసమేతంగా అక్కడి వెళ్లిన రాజమౌళి, ఎన్టీఆర్‌, చరణ్‌ దంపతులకు జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అయితే, అనూహ్యంగా ఎన్టీఆర్ కే అప్పుడు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ జపాన్ ‏లో ఉన్నాడని తెలిసి జపాన్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ను చూసేందుకు ఎగబడ్డారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ను చూసేందుకు లేడీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ స్టే చేస్తున్న హోటల్స్ ముందు క్యూ కట్టారు. దీంతో ఎన్టీఆర్ వారితో ఫోటస్ దిగడమే కాకుండా.. ఆటోగ్రాఫ్స్ ఇచ్చి వారిని సంతోషపరిచాడు. ఈ నేపథ్యంలో వారంతా ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ అభిమానులు మారిపోయారు.

- Advertisement -