ఒక మాట పదిమందికి ఆదర్శం , ఒక మాట పదిమందికి ఉపయోగం , ఒక మాట రాష్ట్రానికి , దేశానికి హరిత విప్లవం , ఒక మాట హద్దులు ,ఆవదలు లేని ఆనందం అదే ఎంపీ సంతోష్ కుమార్ గారి మాట .. కరోనాని దృష్టిలో ఉంచుకొని , ఒకవైపు ప్రపంచమంతా మహమ్మారితో పోరాడుతుంది , మరో వైపు ప్రజల్లో తెలియని ఆందోళన , ఇలాంటి సమయంలో ప్రజల్లో మనోధైర్యం నింపడం కోసం , ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటిలో వేప చెట్టు ఉండాలి అనే ఆలోచనకి అధ్యాత్మికతని జోడించి గౌరవ శ్రీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు వారం రోజుల క్రితం విత్తన గణపతి కి శ్రీకారం చుట్టారు.
వేప చెట్టు ఎందుకు పెంచాలి వేప అనేది 4000 సంవత్సరాలకు పైగా భారతదేశంలో వాడబడుతున్న ఒక ఔషధ మూలిక. వేప చెట్టు యొక్క అన్ని భాగాలు వివిధ రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి, వేప కూడా అరిష్ట అనగా “అనారోగ్యం యొక్క ఉపశమనం” అనే సంస్కృత పేరుతో పిలువబడుతుంది.వేప చెట్టు సాధారణంగా నిండుగా ఆకులను కలిగి ఉంటుంది మరియు 75 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది సాధారణంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. అయితే, ఇది దక్షిణ ఇరాన్ దీవులలో కూడా పెరుగుతుంది. ఇది ఆకు పచ్చ రంగులో ఉంటుంది, ఈ చెట్టు భారతదేశంలో రోడ్డు పక్కలందు సులభంగా పెంచడాన్ని చూడవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుమారు 80% జనాభా సంప్రదాయ ఔషధాలపై ఆధారపడుతున్నారు, ఇవి సాధారణంగా మొక్కలు మరియు మొక్కల యొక్క ఉత్పత్తులను కలిగి ఉంటాయి. చర్మ అంటువ్యాధులు, సెప్టిక్ పుళ్ళు, సోకిన కాలిన గాయాలు మరియు మానవ శరీరాన్ని ప్రభావితం చేసే కొన్ని ఫంగల్ అంటు వ్యాధులు మరియు వివిధ రోగాలను వేప చెట్టు నయం చేస్తుందనేది ఒక తెలిసిన విషయమే.
వేప నూనెతో తయారు వివిధ సబ్బులు, లోషన్లు మరియు షాంపూలు తయారు చేయబడతాయి. కాలేయ పనితీరును మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను సమానంగా ఉండేలా చేయుటలో వేప ఆకులు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి. వెచ్చని నీటిలో వేప ఆకులు కలిపి స్నానం చేయడం వలన ఆటలమ్మ వ్యాధిలో బాధపడుతున్నవారికి ఇది సమర్థవంతoగా పని చేస్తుంది. వేదాలలో, వేపను “సర్వ రోగ నివారిణి” గా సూచిస్తారు, అంటే దీని అర్ధం “అన్ని రోగాలను నయం చేయునది” ఇప్పటికే ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటే కార్యక్రమం విజవంతమైంది దానిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం , ఏకో ఫ్రెండ్లీ సీడ్ గణేశా ని పరిచయం చేశారు ఒక వైపు ఆధ్యాత్మికత , మరోవైపు మానవులకి ప్రయోజనాలు కల్గి ఉన్నందున చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి విత్తన గణపతి చేరువైంది .. అన్ని వర్గాల ప్రజల హృదయాలను దోచుకుంది.