లండన్‌లో నిరాడంబరంగా విత్తన గణపతి వేడుకలు…

207
nimajjnam

లండన్: హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా 8వ వినాయక చవితి వేడుకలు జరిగాయి.లండన్ కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరం లో నిరాడంబరంగా “విత్తన గణపతి” వేడుకలు వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.

ఈ సంవత్సరం కరోనా నిబంధన నేపథ్యం లో ప్రజల భద్రతా దృశ్య వేడుకలను నిరాడంబరంగా నిర్వహించినట్టు హైఫై (HYFY ) అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు,కరోనా నింబంధలను పాటిస్తూనే సంప్రాదాయ బద్దంగా తొమ్మిది రోజులు పూజలు, హోమాలు నిర్వహించామని, ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు గారి స్ఫూర్తితోనే ఈ సంవత్సరం “విత్తన గణపతి” ని ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు మా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామని అశోక్ తెలిపారు.

హైఫై (HYFY ) నాయకుడు మల్లా రెడ్డి బీరం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గణేష్ వేడుకలని ఎన్నారై మిత్రులందరి తో కలిసి, లండన్ వీధుల్లో ఊరేగింపుతో మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహిస్తామని, కానీ నేడు కరోనా వల్ల నిరాడంబరంగా వేడుకల్ని నిర్వహించామని, సహకరించిన కార్యవర్గ సభ్యులకి, శ్రేయోభిలాషులకు ముఖ్యంగా తొమ్మిది రోజులు మాకు సలహాలు సూచనలు అందించడమే కాకుండా 8 సంవత్సరాల నుండి హైఫై (HYFY ) కార్యవర్గాన్ని ముందుకు నడిపిస్తున్న అనిల్ కూర్మాచలం గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

నాయకుడు సత్య చిలుముల మాట్లాడుతూ, ప్రజలందరినీ భగవంతుడు కరోనా నుండి రక్షించాలనే సంకల్పంతోనే నిత్యం పూజలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేక గణపతి హోమం నిర్వహించామని తెలిపారు.నాయకుడు సతీష్ గొట్టెముక్కల మాట్లాడుతూ, కరోనా నిబంధలను పాటిస్తూ తొమ్మిది రోజులు అనుక్షణం అన్ని జాగ్రత్తలు తీసుకొని సంప్రదాయ బద్దంగా అన్ని రకాల పూజలు నిరవహించామని తెలిపారు, సహకరించి ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా వారి ఇంటి ఆవరణలో వేడుకలకు అన్ని రకాల సహకారాన్ని అందించిన మల్లా రెడ్డి – శుష్మణ దంపతులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కరోనా నేపథ్యంలో అశోక్ – జాహ్నవి, మల్లా రెడ్డి – శుష్మణ దంపతులతో పాటు, సత్య చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కల పది రోజుల పాటు ఎక్కడికీ వెళ్లకుండా నవరాత్రి పూజలకే అంకితమై, ప్రజలంతా ఆరోగ్యంగా , సంతోషంగా ఉండాలని లోక కళ్యాణానికై వీరు చేసిన గణపతి సేవ ఎంతో స్ఫూర్తినిచ్చిందని అనిల్ కూర్మాచలం వారిని ప్రత్యేకంగా అభినందించారు.

తొమ్మిది రోజులు పూజించిన గణపతి లడ్డుని నిర్వాహకులు అశోక్ – జాహ్నవి, మల్లా రెడ్డి – శుష్మణ దంపతులకు అందజేశారు, అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లడ్డు తీసుకుంటున్నామని, మా కార్యవర్గ సభ్యులకు, మిత్రులకి, వీలైనంతమందికి లడ్డూ ప్రసాదాన్ని పంపిస్తామని అశోక్,మల్లారెడ్డి తెలిపారు.చివరిగా ఆట పాటలతో వీడుకోలు పలుకుతూ విత్తన గణపతిని ఇంటి ఆవరణలోనే తొట్టి లో నిమజ్జనం చేశారు.

తొమ్మిది రోజులుగా వివిధ సందర్భాల్లో పూజలు నిర్వహించి సహకరించిన ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం – ప్రభలత దంపతులకు, టాక్ అధ్యక్షురాలు పవిత్ర – సత్యం రెడ్డి దంపతులకు, ఇతర ప్రతినిధులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి,స్వప్న, స్వాతి బుడగం, సురేష్ బుడగం, శశిధర్, మౌనిక, రవి రేతినేని, క్రాంతి, హరి నవాపేట్, స్నేహ, సుభాష్ మెగావత్, ప్రియాంక , నరేష్ జక్కుల ,నరేంద్ర జక్కుల , భూషణ్ బుప్పుల , నాగరాజ్ గారిపల్లి , వీర్ నాయుడు శ్రీకాంత్ జెల్లా, శైలజా, రాజ్ బజార్ తదితరులందరికీ హైఫై (HYFY )కార్యవర్గం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.