గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించేందుకు అనుమతివ్వలేం: సుప్రీం

215
ganesh idols supreme court
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు దాటగా మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో గణేశ్ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అనుమతివ్వలేమని తెలిపింది సుప్రీం కోర్టు. గణేశ్ చతుర్ది ఉత్సవాలు అంటేనే భారీ జన సముహామని…భారీగా జనం గుమికూడితే కరోనా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉన్నందున ఉత్సవాలకు అనుమతించేది లేదని తెలిపింది. గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణపై రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే తుది నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు అని కోర్టు వెల్ల‌డించింది.

జైన ఆల‌యాల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై విచారించిన కోర్టు ఈ సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేసింది. అయితే మ‌హారాష్ట్ర‌లోని దాద‌ర్‌, చెంబూర్‌, బైకులా జైన ఆల‌యాల‌ను తెరిచేందుకు మాత్రం కోర్టు అనుమ‌తి ఇచ్చింది. పూర్తి నిబంధ‌న‌ల మ‌ధ్య ఆల‌యాల‌ను తెర‌వాల్సి ఉంటుంది.

- Advertisement -