- Advertisement -
ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి హీరోగా యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. నితిన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న అమెరికాలోనూ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ మంచి మార్కెట్‌తో ముగిసింది. ఈ సినిమాను 400K డాలర్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారి కలెక్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తుండగా, మరో బ్యూటీ అంజలి ఓ హాట్ ఐటెం సాంగ్ చేసింది.
- Advertisement -