నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరి చేతిలో ఉంటుంది. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మొబైల్ లేనిదే రోజు గడవని పరిస్థితి. అయితే మొబైల్ యూజర్స్ ప్రధానంగా ఎదుర్కొనే సమస్య స్పామ్ కాల్స్ అండ్ స్పామ్ మెసేజ్ లు.. సమయం సదర్భం లేకుండా ఇవి వస్తూనే ఉంటాయి. మనం ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడూ లేదా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడేటప్పుడు ఇవి తరచూ వస్తు ఇబ్బంది పెడుతుంటాయి. ఇన్సూరెన్స్ కాల్స్ అని, రియల్ ఎస్టేట్ కాల్స్ అని, లోన్ కాల్స్ అని, యాప్ ప్రమోషన్స్ అని.. ఇలా ఎన్నో రకాల స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అయితే వీటిని ఎలా బ్లాక్ చేసుకోవాలో చాలమందికి తెలియదు..
కాగా ఏ టెలికాం యూజర్ అయిన వీటిని కంప్లీట్ గా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. మొబైల్ లో ఏ సిమ్ కు స్పామ్ కాల్స్ బంద్ చేయాలో దాని నుంచి 1909 కు క్యాపిటల్ లెటర్స్ తో ” FULLY BLOCK ” అని ఎస్ ఏం ఎస్ చేయాలి. ఆ తరువాత వెంటనే మన మొబైల్ కు వచ్చే ఎలాంటి స్పామ్ కాల్స్ అయిన, మెసేజెస్ అయిన కంప్లీట్ గా బ్లాక్ అవుతాయి. అయితే మనకు రావలసిన ఇంపార్టెంట్ మెసేజ్ లు, ఓటిపి వంటివి యధాతథంగా వస్తాయి. కాగా మీరు జియో యూజర్ అయితే మై జియో యాప్ ద్వారా కూడా వీటిని బ్లాక్ చేసుకోవచ్చు.
Also Read:సిలిండర్ ధరలపై ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యాస్త్రం
అదెలాగంటే మై జియో యాప్ ను ఓపెన్ చేసిన తరువాత మేనులోకి వెళ్ళాలి అక్కడ కిందకు స్క్రోల్ చేస్తే సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఒకే చేయాలిఆ తరువాత సర్వీసస్ సెట్టింగ్ కనిపిస్తుంది. అందులో ” do not disturb ” ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి. అక్కడ ఎలట్నీ ఎస్ ఏం ఎస్ లను బ్లాక్ చేయాలి అని అడుగుతుంది. fully block అనే ఆప్షన్ ఎంచుకుంటే ఓటిపి మరియు ట్రాన్సాక్సన్స్ మెసేజ్ లు మినహా మిగిలిన ఎటువంటి మెసేజ్ లు అయిన బ్లాక్ అవుతాయి. అలా కాకుండా ” promotional communication ” ఆన్ చేస్తే ప్రమోషన్స్ కు సబంధించిన మెసేజ్ లు మాత్రమే బ్లాక్ అవుతాయి. ఈ విధంగా స్పామ్ మెసేజ్ లను ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు.
Also Read:Nagarjuna:#D51లో కింగ్ నాగార్జున