న‌క్స‌లైట్ పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి..

328
Sai_Pallavi.
- Advertisement -

మ‌ల‌యాళ న‌టి సాయి పల్ల‌వికి టాలీవుడ్ లో చాల క్రేజ్ ఉంది. మ‌రీ ముఖ్యంగా ఆమెకు యూత్ లో చాలా మంచి ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకుంది. తెలుగులో ఆమె న‌టించిన సినిమాలు మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ఇటివ‌లే ఆమె శ‌ర్వానంద్ స‌ర‌స‌న ప‌డిప‌డి లేచే మ‌న‌సు సినిమాలో న‌టించింది. తాజాగా ఆమె మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల చెప్పిన స్టోరీకి ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తుంది. ఈచిత్రానికి విరాట‌ప‌ర్వం 1992 అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు.

sai pallavi venu udugula

ఈమూవీలో సాయి ప‌ల్ల‌వి న‌క్స‌లైట్ గా కనిపిస్తుంద‌ని స‌మాచారం. ఈసినిమాలో రాణా కూడా న‌టించ‌నున్నాడు. రాణా పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల నీది నాదీ ఒకేక‌థ సినిమాను తెర‌కెక్కించారు. శ్రీ విష్ణు హీరోగా న‌టించిన ఈమూవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. రాణా సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నున్న ఈమూవీకి సంబంధించిన పూర్తీ వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

- Advertisement -