వైఎస్ఆర్‌ ‘యాత్ర’ నుంచి వీడియో సాంగ్..

232
Yatra Movie
- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహీ వి రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర .. జనం నుంచి లభించిన ఆదరణ .. ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం ఈ బయోపిక్‌లో చూపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

Yatra Movie

“ఊర్లే యేరెల్లే మారి హోరు హోరున ఉప్పొంగెరో .. దార్లే తారంగవాడి సేతులెత్తి జై కొట్టెరో .. “అంటూ ఈ సాంగ్ సాగుతోంది. వైఎస్ పాత్రలో మమ్ముట్టి గ్రామ గ్రామాన పాదయాత్రలు చేస్తూ .. అక్కడి ప్రజల కష్టనష్టాలను తెలుసుకునే దృశ్యాలతో ఈ సాంగ్ కొనసాగింది. కె .. సంగీతాన్ని అందించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చారు. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ గీతం మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా వుంది.

https://youtu.be/x0H7OpL3afE

- Advertisement -