గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన హీరోయిన్‌ మెహ్రీన్..

174
Heroine Mehreen
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నటి మెహ్రీన్ పిర్జాదా గురువారం రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మెహ్రీన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరం అని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు మెహ్రీన్ ధన్యవాదాలు తెలిపారు.

రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలన్న గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని మెహ్రీన్ పిర్జదా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని మెహ్రీన్‌కు అందజేశారు.

- Advertisement -