చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..

39

ఓటీఎస్‌ విధానంపై టిడిపి అసత్య ఆరోపణలు చేస్తున్నదని. పేదల పట్ల చంద్రబాబుకు విశ్వాసం లేదన్న కారణంతోనే ఓటీఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. గురువారం ఆమె నిండ్ర మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రబీ వేరుశెనగ సబ్సిడీ విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా శాశ్వత భూ హక్కు వర్తిస్తుందని రోజా తెలిపారు.

ఇలాంటి ఉత్తమమైన విధానాన్ని టిడిపి వ్యతిరేకించడం విడ్డురం అని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లలో కనీసం 14 ఇళ్లను కూడా నువ్వు చూపించే సాధనం ఇవ్వలేదని ఆరోపించారు. టిడిపి నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు విశ్వసించరని పేర్కొంటూ చంద్రబాబుపై రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.