- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బ్యాక్ హీరో దినేష్ తేజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ళ.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అందులో పాల్గొని మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా మరో ముగ్గురిని ( అంజలి , నివేదిత తామస్ , ప్రియాంక జ్వలిత ) లను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో పౌండర్ రాఘవ పాల్గొన్నారు.
- Advertisement -