మొక్కలు నాటిన టీఎస్‌ఎండీసీ ఎండీ డాక్టర్ మల్సూర్..

123
tsmdc

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని ఎంపీ; ఎమ్మెల్యే కాలనీ లోని తన నివాసంలో మొక్కలు నాటారు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ మల్సూర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకు పోతున్నారని దానిలో భాగంగా నేను కూడా నా మిత్రుడు దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా తన మిత్రులు చిక్కపల్లి సురేష్,యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్, హరిబాబు ,నటుడు రవి ప్రకాష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.