ఇండియన్ సినీ పరిశ్రమ అంటేనే కాస్త పురుషాదిక్యం ఎక్కువ. హీరోనే సినిమాను లీడ్ చేస్తాడు. ఓ సినిమాలో హీరోకు ఉన్నంత ప్రాధాన్య హీరోయిన్‌కు ఉండదు. అఖరికి రెమ్యునరేషన్ విషయంలో కూడా హీరో, హీరోయిన్ల మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లే స్పందించారు. తాజాగా ఈ వివాదాన్ని బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ మరోసారి లేవనెత్తింది. ఏ సినిమాలోనైనా హీరోయిన్‌గా నటించాలంటే.. అందుకు హీరో పర్మిషన్ వుండాల్సిందే. హీరో సూచన మేరకే హీరోయిన్ల ను ఎంపిక చేసుకుంటున్నారని,,,తీవ్రంగా ఖండించింది.
సినీ ఇండిస్టీలో హీరోయిన్లను ఎంపిక చేసుకునేది హీరోలు మాత్రమే,,ఈ విషయంలో దర్శకనిర్మాతలకు చాలా తక్కువ పాత్ర ఉంటోందని కుండ బద్దలు కొట్టింది. ఉదాహరణ తెలుపుతూ..షారుక్ ఖాన్‌తో నటించే అవకాశం తనకు చాలాసార్లు వచ్చిందని, అయితే అది కార్యరూపం దాల్చలేదని, కారణం తాను షారుక్‌తో నటించాలనుకోవడం కాదు, షారుక్ ఎప్పుడైతే తనతో నటించాలనుకుంటారో, అప్పుడు నాకు ఆ అవకాశం లభిస్తుందని’ సోనమ్ కొట్టినట్లుగా చెప్పింది. ఏ హీరోయిన్‌తో చేయాలి? చేయకూడదనే విషయాలను హీరోనే నిర్ణయిస్తున్నాడని తేల్చిచెప్పింది. రీసెంట్‌గా తాప్సీ కూడా ఇదే విషయాన్ని ఇన్ డైరెక్ట్ చెప్పే ప్రయత్నం చేసింది.
అప్పుడప్పుడు ఘాటు స్టేట్‌మెంట్లతో జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోనే,,ఈసారి హీరోల ఆధిక్యంపై స్పందించింది. సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వారసులకు అవకాశాలు సులువుగా వచ్చేస్తాయని చాలామంది భావిస్తుంటారని, కానీ అది తప్పని అంటోంది. నిజానికి తాను అనిల్ కపూర్ కుమార్తె కావడం వల్లే చాలా అవకాశాలు చేజారాయని నిట్టూరుస్తోంది.