పండంటి బాబుకి జన్మనిచ్చిన సోనమ్!

69
sonam
- Advertisement -

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ తల్లైంది. 2018 మేలో ఆనంద్‌ అహుజాని పెళ్లి చేసుకోగా ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది.

తాజాగా సోనమ్ కపూర్ పండంటి బాబుకి జన్మనిచ్చినట్టు ప్రకటించింది.ఆగస్టు 20, 2022.. మా బాబు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. డాక్టర్స్, నర్సులు, కుటుంబసభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని వెల్లడించింది.

ఇది ప్రారంభం మాత్రమే, మా బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు. ఇట్లు మీ సోనమ్‌-ఆనంద్‌ అని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -