రామ్‌చరణ్‌కి హ్యాండిచ్చిన అల్లుఅరవింద్‌

268
alluaravind Given the shock to ram Charan
- Advertisement -

చిరంజీవి తనయుడు మెగాహీరో రామ్ చరణ్‌ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ధృవ. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. మరో పది రోజుల్లో రామ్ చరణ్‌ తన ధృవ మూవీని పూర్తి చేసి…నెక్ట్స్ ప్రాజెక్ట్ కి షిప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్‌ విలక్షణ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నారు. మరికొది నెలల్లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ సక్సెస్ ని సాధించిన సుకుమార్…ఇప్పుడు రామ్ చరణ్‌ మూవీపై ప్రత్యేకమైన శ్రద్ధని చూపిస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

alluaravind Given the shock to ram Charan

నాన్నకు ప్రేమతో మూవీ కమర్షియల్ సక్సెస్ ని సాధించినప్పటికీ…కొన్ని వర్గాల ప్రేక్షకులకి ఇది ఆశించినంత సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే ఈసారి రామ్ చరణ్‌ తో చేయబోతున్న సినిమా అన్ని విధాలుగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడట దర్శకుడు సుకుమార్‌. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చే మూవీ ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామాగా రానుందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌ పైకి వెళ్ళనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిఖన్నాను సెలక్ట్ చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమచారం.

alluaravind Given the shock to ram Charan

ఇదిలా ఉంటే సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి మొదట నిర్మాతగా అల్లుఅరవింద్ అని అనుకున్నారు. రామ్ చరణ్ ఈ ప్రపోజల్ ని అల్లుఅరవింద్ వద్దకి తీసుకువెళ్ళారు. అయితే అల్లుఅరవింద్ ఈ సినిమాని చేయలేనని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు మెగాహీరో రామ్‌చరణ్‌. సుకుమార్ మూవీ అంటే అనుకున్న బడ్జెట్ లో పూర్తి కానీ చిత్రం. 50 కోట్ల అనుకుంటే అది పూర్తయ్యేసరికి 60 వరకూ వెళుతుంది. అలాగే తనకి కావాల్సిన సీన్స్ ని కాకుండా…ఎక్కువ సీన్స్ ని సుకుమార్ చిత్రీకరణ చేస్తాడు. ఇది ఎడిటింగ్ లో పెద్ద సమస్యగా మారుతుంది. ఇవన్ని అల్లుఅరవింద్ కి అంతగా నచ్ఛని విషయాలు. అందుకే చరణ్ కి సింపుల్ గా నో అని చెప్పుకొచ్చాడు అరవింద్‌.

alluaravind Given the shock to ram Charan

దీని తర్వాత మరో కొత్త నిర్మాత పేరు వెలుగులోకి వచ్చింది. అదే మైత్రి మూవీ మేకర్స్. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సుకుమార్ మాత్రం నిర్మాతలను భారీగా ఖర్చు చేయిస్తాడనే టాక్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. మూవీని విభిన్నంగా తెరకెక్కించినప్పటికీ…తను మూవీ హిట్టయితే బ్లాక్ బస్టర్ గానూ..లేదంటే ఘోరంగానూ ఉంటుంది. కానీ టెక్నికల్ విషయంలో మాత్రం సుకుమార్ సూపర్ అని అంటారు.

మరి రామ్‌చరణ్‌ సుకుమార్‌ డైరెక్షన్‌ల్లో ఈ కొత్త మూవీ పట్టాలు ఎప్పుడు ఎక్కతుందో వెచిచూడాలి

- Advertisement -