ఆ హీరోలను చూస్తే..జెలసీ

217
- Advertisement -

ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ వాతావరణం ఉండడం కామన్. ఆ హీరో హిట్ కొడితే…తాను సూపర్ హిట్‌ కొట్టాలని..ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తారు. ఇలా హీరోల మధ్య ఎంతటి పోటీ ఉన్నా..సినిమా రిలీజై విజయం సాధిస్తే అభినందనలు తెలియజేసుకుంటారు. అలా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో మిగతా హీరోలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతర హీరోల సినిమాలు విజయవంతమైనపుడు ఫోన్‌ చేసి అభినందిస్తుంటాడు. ఇలా మహేష్‌, ఎన్టీయార్‌, అఖిల్‌, ప్రభాస్‌, రానా కూడా చరణ్‌కు విషష్‌ తెలుపుతుంటారు. ఇలాంటి చరణ్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలంటే చాలా అసూయట.

Ram-Charan
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ ‘ధృవ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. టాలీవుడ్‌ హీరోలు డిఫరెంట్ కథలను ఎంచుకుని విజయవంతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా చరణ్‌కు యువహీరోలు శర్వానంద్‌, నానిలను చూస్తే చాలా అసూయట. అసూయ వాళ్ల మీద కాదు..వాళ్లు సెలక్ట్ చేసుకునే కథల మీదట.‘శర్వానంద్‌, నాని కథలను ఎంపికచేసుకునే విధానం నాకు అసూయను కలుగచేస్తుంటుంది. ఆ విషయంలో వాళ్లను చూసి కొన్నిసార్లు జెలసీగా ఫీలవుతా. వాళ్లలాగానే నాకూ విభిన్నమైన కథల్లో నటించాలని ఉంటుంద’ని తన మనసులో మాట బయటపెట్టాడు చరణ్. కాగా హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న చరణ్‌కు ధృవ లాంటి డిఫరెంట్‌ మూవీతో మంచి హిట్ పడింది.

Ram Charan, Sharwanand at Ko Ante Koti Audio Release Photos

Ram Charan, Sharwanand at Ko Ante Koti Audio Release Photos

- Advertisement -