నా దగ్గర అన్ని డబ్బులు లేవు:రామ్‌ చరణ్‌

170
ram charan

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో పాటు చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సైరాను నిర్మిస్తున్నారు రాంచరణ్‌. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు చెర్రీ.

సైరా షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశలో ఉందని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని, అందుకే రీషూట్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తవుతుందని, రీషూట్స్ జరగడంలేదన్నారు. అంత డబ్బు తన వద్ద లేదని సైరా దసరాకు రిలీజవుతుందని తెలిపారు.

నలుగురు అన్నదమ్ముల కథే వినయ విధేయరామ సినిమా అన్నారు. ప్రతి వ్యక్తి క్యారెక్టర్లో వినయం, విధ్వంసం ఉంటాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ కూడా అంతే అన్నారు. మహేశ్, తారక్‌ వంటి వాళ్లతో నేను బాగా కలిసిపోతాను. సోషల్‌ మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ విషయం బయటకు తెలుస్తోందన్నారు.

కలెక్షన్స్ విషయంలో పోటీ ఎందుకని నిర్మాతలకు మంచి డబ్బులు వస్తే చాలన్నారు. క్యారెక్టర్స్‌ ,సినిమాలు ఇంకా బాగా చేయాలనే విషయంలో పోటీ ఉండాలన్నారు.