పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరీనా..

105
Kareena

బాలీవుడ్‌ హీరోయిన్ కరీనా కపూర్ తల్లి పాత్ర ను పోషించబోతోంది. ఏంటి ఈ పాత్ర సినిమాల్లో అనుకుంటే పొరపాటే..నిజజీవితంలోనే. అవును బాలీవుడ్‌ బేబో తల్లి అయింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంటకు కుమారుడు జన్మించాడు. ఈ రోజు ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో పండంటి మగబిడ్డకు కరీనా జన్మనిచ్చింది. తల్లి, కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఈ సందర్భంగా బ్రీచ్ క్యాండీ వైద్యులు తెలిపారు. కరీనా కపూర్‌కు మంచి స్నేహితుడైన దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసి, ఆమె కొడుకు పేరును కూడా బయటకు ప్రకటించేశాడు. బుడ్డోడి పేరు తైమూర్ అలీఖాన్ అని చెప్పాడు. బెబోకు కొడుకు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు.

Kareena

2012లో సైఫ్, కరీనాలు పెళ్లి చేసుకున్నారు. సైఫ్ ఇది రెండో పెళ్లికాగా, కరీనాకు మొదటి మ్యారేజ్. సైఫ్ తొలి పెళ్లి నటి అమృతా సింగ్ తో జరిగింది. వీరికి కుమార్తె సారా, కుమారుడు ఇబ్రహీంలు జన్మించారు. అయితే విభేదాల వల్ల అమృతా సైఫ్‌ తో విడిపోయి..విడాకులు తీసుకుంది. ఆతర్వాత సైఫ్, కరీనా ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్న సందర్బంలో ప్రేమలో పడ్డారు. పెద్ద అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి కరీనా కపూర్‌ మాతృ ప్రేమను పొందింది. పెళ్లైయ్యాక కూడా సినిమాల్లో నటించిన కరీనా..పిల్లలు పుట్టాక కూడా సినిమాల్లో నటిస్తానని ఎప్పుడో చెప్పింది.

Kareena

Kareena