“అవంతిక” పోరాటం..

129
Avantika movie Trailer release

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 90వ చిత్రం “అవంతిక. అవును, జయమ్ము నిశ్చయమ్ముర చిత్రాలతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న పూర్ణ టైటిల్ పాత్ర పోషించిన”అవంతిక” చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యకమానికి మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డా.కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సినిమా అసాధారణ విజయం సాధించాలని రోశయ్య ఆకాంక్షించారు. తనకు చిరకాలంగా సన్నిహితుడు, సహృదయుడైన రామసత్యనారాయణ త్వరలోనే నూరు చిత్రాలు పూర్తి చేయాలని ఈ సందర్భంగా రోశయ్య ఆశీర్వదించారు.

Avantika movie Trailer release

హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ వేడుకలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్, శివాజీరాజా, కృష్ణుడు, సత్యారెడ్డి తదితర ప్రముఖులతోపాటు చిత్ర బృందం పాల్గొంది. అవంతిక ట్రైలర్‌ ను రోశయ్య చేతులు మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉందని రామసత్యనారాయణ పేర్కొన్నారు. తాను నిర్మించే నూరవ చిత్రం ప్రారంత్సవాన్ని రోశయ్యగారి చేతుల మీదుగానే జరుపుతానని తెలిపారు. చిత్ర దర్శకుడూ శ్రీరాజ్ బళ్లా “అవంతిక” చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడని, దర్శకుడిగా అతనికి చాలా మంచి భవిష్యత్ ఉందని అన్నారు.

అతిధులందరూ “అవంతిక” ఘన విజయం సాధించాలని అభిలషించారు. గీతాంజలి, షాయాజీ షిండే, అజయ్ ఘోష్, షకలక శంకర్, ధనరాజ్, శ్రీరాజ్, రవిరాజ్, సంపత్ రెడ్డి, గిరిధర్, ఫణిరాజ్, మల్లిక, విజయ్ కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసారి, ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, మాటలు: క్రాంతి నైనా, పాటలు: భారతీబాబు-శ్రీరామ్, సంగీతం: రవిరాజ్ బళ్లా, రీ-రికార్డింగ్: ప్రధ్యోతన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ అప్పాజీ, సమర్పణ: కె.ఆర్.ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్లా.