పోలీసులకు శ్రీకాంత్…జర్నలిస్టులకు హరిష్ సాయం

337
srikanth
- Advertisement -

కరోనా మహమ్మారి కట్టడి కోసం తమకు తోచినంతగా సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకువస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో శ్రీకాంత్, దర్శకుడు హరీష్‌ శంకర్ తమవంతు సాయాన్ని అందించారు.

కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు శానిటైజర్లు, ఆహారాన్ని అందించారు శ్రీకాంత్. రాయదుర్గం పోలీస్ సిబ్బందికి ఆహారపదార్థాలను అందించిన శ్రీకాంత్…పోలీసుల సేవలను కొనియాడారు.

కరోనా మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్. దాదాపు 100 మంది జర్నలిస్టులకు సాయాన్ని అందించారు.

- Advertisement -