పవన్‌ సినిమాలపై నాగబాబు హాట్ కామెంట్స్..!

251
pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్న పవన్‌…ఈ మూవీతో పాటు క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు నాగబాబు. పింక్ సినిమాపై పవన్‌కు మొదటినుండి ఆసక్తిఉందని…ఈ విషయాన్ని తనతో పవన్ పలుమార్లు చెప్పారని తెలిపారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని …రీఎంట్రీతో పవన్ అదరగొట్టడం ఖాయమన్నారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కథ కోహినూర్ వజ్రం చుట్టూ నడుస్తుందని మొగలాయిల కథ ఆధారంగా రూపొందుతుందన్నారు. పవన్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా క్రిష్ కథను రెడీ చేస్తున్నారని తెలిపారు. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. మొత్తంగా నాగబాబు స్టేట్‌ మెంట్‌తో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.