శ్రీ‌విష్ణు హీరోగా కొత్త చిత్రం ప్రారంభం..

260
Hero Sree Vishnu
- Advertisement -

విల‌క్ష‌ణ‌ క‌థ‌ల‌తో, భిన్న త‌ర‌హా చిత్రాల‌తో, అభిన‌యానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న శ్రీ‌విష్ణు.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ఇంట‌రెస్టింగ్ సినిమాల‌కు సంత‌కం చేస్తూ వ‌స్తున్నారు. లేటెస్ట్‌గా శ్రీ‌విష్ణు క‌థానాయ‌కుడిగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 11గా బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌దీప్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో నారా రోహిత్ క్లాప్ నివ్వ‌గా, నిర్మాత శిరీష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ స‌న్నివేశానికి శ్రీ‌రామ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూజా కార్య‌క్ర‌మాల్లో ఫ‌ణికుమార్‌, విజ‌య‌ల‌క్ష్మి, గంజి ర‌మేష్ కుమార్ పాల్గొన్నారు. ద‌ర్శ‌కునికి శిరీష్ స్క్రిప్టును అంద‌జేశారు.యాక్ష‌న్ ఎమోష‌నల్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని రోల్‌లో శ్రీ‌విష్ణు క‌నిపించ‌నున్నారు. టాప్ టెక్నీషియ‌న్లు ఈ మూవీకి ప‌నిచేస్తున్నారు.

హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మిగ‌తా టెక్నీషియ‌న్ల పేర్ల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. శ్రీ‌విష్ణు న‌టిస్తోన్న ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్ పూర్త‌వ‌గా, ‘గాలి సంప‌త్’ చిత్రం, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న టైటిల్ ఖ‌రారు చేయ‌ని సినిమా షూటింగ్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి.

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: ప్ర‌దీప్ వ‌ర్మ అల్లూరి
ప్రొడ్యూస‌ర్‌: బెక్కెం వేణుగోపాల్‌
బ్యాన‌ర్‌: ల‌క్కీ మీడియా
సినిమాటోగ్ర‌ఫీ: శివేంద్ర‌
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

- Advertisement -