ఏపీలో కొత్తగా 319 పాజిటివ్ కేసులు..

27
corona

ఏపీలో గడచిన 24 గంటల్లో 59,671 కరోనా పరీక్షలు నిర్వహించగా, 319 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 308 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,84,490 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,74,531 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,832 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,127కి చేరింది. కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 46 కేసులు, చిత్తూరు జిల్లాలో 44 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 10 కేసులు ఉన్నాయి.